వేరుశెనగలు తీసుకోండి.. సంతానలేమిని దూరం చేసుకోండి

వేరుశెనగల్లో అద్భుతమైన పోషకాలున్నాయి. మధుమేహం, గుండెపోటు, గర్భాశయ సమస్యలు, కేన్సర్, ఒబిసిటీకి ఇది చెక్ పెడుతుంది. శెనగల్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకునేవారిలో గర్భాశయ సమస్యల

ఆదివారం, 16 అక్టోబరు 2016 (18:11 IST)
వేరుశెనగల్లో అద్భుతమైన పోషకాలున్నాయి. మధుమేహం, గుండెపోటు, గర్భాశయ సమస్యలు, కేన్సర్, ఒబిసిటీకి ఇది చెక్ పెడుతుంది. శెనగల్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకునేవారిలో గర్భాశయ సమస్యలుండవు. గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో గడ్డలు, సంతానలేమిని దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. 
 
వేరు శెనగల్లోని మాంగనీస్, రక్తంలోని పిండి పదార్థాలు కొవ్వును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చు. అందుచేత మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజుకు ఓ గుప్పెడు వేరుశెనగల్ని తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిల్లలు, వృద్ధులు వేరుశెనగల్ని తీసుకోవడం ద్వారా ఎముకల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.  
 
రోజూ 30 గ్రాముల వేరుశెనగలు తింటే హార్ట్ వాల్స్‌ను భద్రపరిచినవారవుతారు. యాంటీయాక్సిడెంట్స్.. గుండెపోటును నివారిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. ఇందులోని యాంటీయాక్సిడెంట్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. 
 
నట్స్‌లోని బాదం, పిస్తా కంటే వేరుశెనగల్లోనే అధిక పోషకాలున్నాయి. మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఇ1, ఇ12, నియాసిన్, పీచు వంటివి ఉన్నాయి.

అన్నీ చూడండి

ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తమను వదిలేయాలంటూ ప్రాధేయపడిన మహిళ

పోక్సో కేసు : బండి భగీరథ్‌కు బెయిల్

శిక్షణ ఇస్తూనే విమానం నుంచి దూకి ఆత్మహత్య

వైజాగ్ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్, అత్తమామలకు సమన్లు

అమెరికాలో భార్యను చంపి.. ప్రియురాలికి ఫోటో పంపిన టెక్కీ

అన్నీ చూడండి

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

M.S. Raju: మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ గా అగధ వుంటుంది : ఎం.ఎస్. రాజు

చంపడం సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు...వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్

Eluru Srinu : బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా డ్యూ డేట్‌ చిత్రం ప్రారంభం

Toxic song: యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా తబాహీ సాంగ్

తర్వాతి కథనం
Show comments