1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Guava health benefits

జామపండు గుజ్జులో తేనెను కలిపి తీసుకుంటే?

Guava
జామపండును ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు. జామపండును తింటే శరీరంలో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు చెట్టులోని 20 నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ప్రారంభ ఆరోగ్య సర్‌చార్జ్ చెల్లిస్తే యుకెలో భారతీయ విద్యార్థులకు జాతీయ ఆరోగ్య సేవకు ఉచిత ప్రవేశం