1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (13:27 IST)

రాత్రిపూట లేటుగా నిద్రపోవద్దు.. యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

రాత్రిపూట లేటుగా నిద్రపోవడం.. ఉదయం లేటుగా లేవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. టీవీల ముందు గంటలకొద్దీ కూర్చోవడం, సెల్ ఫోన్లతో సహవాసం చేయడం ద్వారా చాలామంది హాయిగా నిద్రపోకుండా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకు

రాత్రిపూట లేటుగా నిద్రపోవడం.. ఉదయం లేటుగా లేవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. టీవీల ముందు గంటలకొద్దీ కూర్చోవడం, సెల్ ఫోన్లతో సహవాసం చేయడం ద్వారా చాలామంది హాయిగా నిద్రపోకుండా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే వేకువ జామున నిద్రలేస్తే ఉత్సాహం ఉంటామని.. అనారోగ్య సమస్యలు దరిచేరవని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పడుకునేముందు టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కళ్ళపై ప్రభావం చూపుతుంది. కావాల్సినంత సేపు నిద్రపోకపోవడం వల్ల ఆ రోజంతా మూడీగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఓ నియమం ప్రకారం నిద్ర పోవాలి. ప్రతిరోజూ ఉదయాన్ని యాక్టీవ్‌గా ప్రారంభించాలంటే ముందుగా స్నానం చేయాలి. అలా నిద్రలేవగానే స్నానం చేయడం వల్ల బద్ధకాన్ని దూరం చేయవచ్చు. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
 
నిద్ర మత్తు వదలాలంటే లేచిన వెంటనే సూర్యరశ్మి నగరానికి తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల నిద్రమత్తు వదిలి, శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజమైన ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే జాగింగ్‌, వాకింగ్‌లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.