మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (15:11 IST)

తరచూ పుట్టగొడుగులను ఆరగిస్తే...

సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. ప్రస్తుతం చిత్తకార్తెలో సైతం ఇవి చాలా అరుదుగా లభిస్తున్నాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్ల

సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగులు చాలా అరుదు. ఇవి సంవత్సరంలో చిత్తకార్తెలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. ప్రస్తుతం చిత్తకార్తెలో సైతం ఇవి చాలా అరుదుగా లభిస్తున్నాయి. వానలు కురిసినప్పుడు లేక వాతావరణం చల్లగా ఉన్నపుడు మాత్రమే ఇవి లభిస్తాయి. ఈజీగా కొవ్వు కరిగించే సత్తా పుట్టుగొడుగుల సొంతం. పుట్ట‌గొడుగులను ప్ర‌యోజ‌నాల పుట్టగా అభివర్ణిస్తారు కూడా. అలాంటి పుట్టగొడులను తరచూ ఆరగిస్తుంటే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట.
 
ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. పుట్టగొడుగులు తరచూ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుందట. ఇవి సెరబ్రల్‌ నరాల పెరుగుదలను వృద్ధిచేయడమే కాకుండా డిమెన్షియా, అల్జీమర్స్‌ వంటి మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయట. డిమెన్షియా, అల్జీమర్స్‌ జబ్బులకు కారణమైన న్యూరోటాక్సిక్‌ స్టిమ్యులీ నుంచి కూడా ఇవి కాపాడుతాయని వైద్యుల పరిశోధనలో వెల్లడైంది.