శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 16 నవంబరు 2016 (22:10 IST)

రాత్రిపూట భోజనం చేయగానే నిద్రపోతే ఏమవుతుంది?

రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసేసి చాలామంది వెంటనే గుర్రుపెట్టి నిద్ర లాగించేస్తారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత నిదానంగా కనీసం వంద అడుగులైనా నడవాలి. దీనివల్ల త్వరగా భుజించిన ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు వీలు కలుగుతుంది. మెడ, మోకాళ్లు, నడుమ

రాత్రిపూట కడుపు నిండా భోజనం చేసేసి చాలామంది వెంటనే గుర్రుపెట్టి నిద్ర లాగించేస్తారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత నిదానంగా కనీసం వంద అడుగులైనా నడవాలి. దీనివల్ల త్వరగా భుజించిన ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు వీలు కలుగుతుంది. మెడ, మోకాళ్లు, నడుము మొదలగు అవయవాలకు పని దొరుకుతుంది. 
 
భోజనం చేసిన తర్వాత భుక్తాయాసంతో కూర్చున్నవారికి బానపొట్ట పెరుగుతుంది. నడుము వాల్చి పడుకునేవారికి మంచి బలము కలుగుతుంది. భోజనానంతరం పరుగెత్తడం, వ్యాయామం చేయడం చెడు ఫలితాలనిస్తాయి. 
 
రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎనిమిది ఉశ్వాస, నిశ్వాసములు కలిగే వరకూ వెల్లకిలా పడుకోవాలి. తర్వాత 16 ఉశ్వాస, నిశ్వాసాలు వచ్చేవరకూ కుడిప్రక్కకు తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత 32 ఉశ్వాస, నిశ్వాసాలు కలిగే వరకూ ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి. ఆ తర్వాత ఎలా నిద్రపడితే అలా పడుకోవచ్చు. నాభిపైన ఎడమవైపు జఠరాగ్ని ఉంటుంది కనుక తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడం జరుగుతుంది.
 
నిద్రపోయేందుకు అనుకూలమైన స్థలమును ఎన్నుకోవాలి. మంచి గాలి వచ్చేట్లు ఉండాలి. గాలి బావుండట వలన తాపము, పిత్తము, చెమట, మూర్చ, దప్పిక మొదలగు వాటిని పోగొడుతుంది.