బొప్పాయిని అతిగా తీసుకోకూడదట.. తీసుకుంటే?
బొప్పాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ సౌందర్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల కొలెన్, గర్భాశయ క్యాన్సర్‌లను సైతం తరిమికొట్టవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఇష్టానుసారంగా బొప్పాయిని తీసుకుంటే ఇందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల చర్మం రంగు మారుతుంది. అదే విధంగా కళ్లు తెల్లగా కూడా మారుతాయంటా... చేతులు పచ్చ రంగులోకి మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చ కామెర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. గర్భినీ స్త్రీలు అస్సలు ఈ బొప్పాయిని తీసుకోకూడదు.
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ పండును తినకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. మితిమీరి బొప్పాయిని తింటే వీర్యకణాలపైనా ప్రభావం చూపవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు తరుచుగా బొప్పాయి తీసుకుంటుంటారు. అయితే అతిగా ఈ పండును తింటే షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోవచ్చునని.. అందుచేత రోజు అర కప్పు మేర తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.