యాలుకల పవర్ తెలిస్తే తినేస్తారంతే
చాలామంది శృంగారంలో ఒత్తిడి ఉండటం వల్ల సరిగ్గా భాగస్వామిని తృప్తి పరచలేరట. ఆ ఒత్తిడి కూడా ఈ యాలకలు తగ్గిస్తాయంటన్నారు నిపుణులు. యాలకల్లో విటమిన్ సి, ఎ, బి రైబో ఫ్లేవిన్, శరీరానికి కావలసిన మినరల్స్ ఉండటం వల్ల శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపించి, రక్తాన్ని శుద్ధి చేస్తాయట.
యాలకుల గింజలను చప్పరిస్తూ ఉండటం వల్ల నోట్లో కొన్ని ద్రవాలు ఉత్పత్తవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుందట. అంతేకాకుండా నోట్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహకరిస్తాయట.
యాలుకలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయట. అందుకే వీటిని రాత్రి పూట నమిలి మింగడం వల్ల అధిక బరువు తగ్గిపోతుంది. అందుకే వీటిని తినడం అలవర్చుకోండంటున్నారు నిపుణులు.