సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (21:47 IST)

దానిమ్మ పండు ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

దానిమ్మ పండు వేరు, కాండం తీసుకుంటే శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. దానిమ్మ పువ్వులు దంతాలకు మేలు చేస్తాయి. దానిమ్మ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాక గుండె జబ్బులను నివారిస్తుంది. 
 
డయేరియా సమస్యతో బాధపడేవారు దానిమ్మ రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ నివారించడానికి దానిమ్మ రసాన్ని ఉపయోగిస్తారు. రక్తం గడ్డకట్టకుండా నివారించే ఆస్పిరిన్‌లో ఉన్న లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి.
 
రోజుకో దానిమ్మను తీసుకునేవారిలో మతిమరుపు సమస్య తలెత్తదు. చక్కని జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. చర్మ సౌందర్యానికి కావలసిన మాయిశ్చరైజర్‌గా దానిమ్మ నూనె ఉపయోగపడుతుంది. వాపులు, నొప్పులు పోగొట్టడానికి దానిమ్మ నూనెను ఉపయోగించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.