చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను ఛాతీ మీద రాస్తే...
చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను ఛాతీ మీద, మెడల మీద రాసి, వెచ్చటి కాపడం పెడితే కఫం తగ్గిపోతుంది.
చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే దానిమ్మపూలను మెత్తగా నూరి పండ్లకు, చిగుళ్లకు రాసి బాగా పట్టేటట్లు రుద్దాలి. ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చెవిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది నూనె వంటివి చెవిలో పోస్తుంటారు. ఎట్టి పరిస్ధితిల్లో నూనె వంటి పదార్ధాలను చెవిలో వేయకూడదు. ఇవి ఇన్‌ఫెక్షన్‌ను మరింత పెంచే అవకాశం ఉంది.
చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి రుగ్మతలకు తేనె, పసుపు చక్కటి విరుగుడు. రోజుకు రెండుసార్లు ఒక టీస్పూను తేనెలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవాలి. తేనె లేనట్లయితే ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.
చారులో మిరియాల పొడి నెయ్యి పోపు పెట్టి... దాంతో భోంచేస్తే కఫం తగ్గుతుంది. ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, ఆ రసంలో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కోలుకుంటారు.