శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (12:14 IST)

కరోనా మహమ్మారితో తొలి భారతీయుడు మృతి.. చైనానే కారణమా?

ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా మహమ్మారితో తొలి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన త్రిపురలోని పూర్తాల్‌రాజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన మానీర్ హోస్సేన్ (23) మృతి చెందాడు. 2018 రెస్టారెంట్‌లో పనిచేసేందుకు మలేషియా వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడ పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా వుంటున్నాడు. 
 
అయితే చైనాలో ప్రబలిన కరోనా వైరస్ మలేషియాలోకి ప్రవేశించింది. ఈ వ్యాధి మానీర్‌ను కూడా సోకింది. అయితే ఇతనికి చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని మానీర్ తాతయ్య ధ్రువీకరించారు. మానీర్ మరణించినట్లు మలేషియా అధికారులు ఫోనులో చెప్పారని అతని తాన అబ్ధుల్ రహీమ్ చెప్పారు. దీంతో కరోనా కాటేసి ప్రాణాలు కోల్పోయిన తొలి భారతీయుడిగా మానీర్ హోస్సేన్ నిలిచాడు. 
 
కరోనా వ్యాప్తి చెందిన వుహాన్‌ సిటీలోనే చైనా బయో వెపన్స్‌ తయారు చేస్తోందంటున్నారు ఇజ్రాయిల్‌‌కు చెందిన రిటైర్డ్ మిలిటరీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ డేనీ షోహమ్. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోనే వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లాబోరేటరీ ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు లీకైందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ల్యాబ్‌లో వైరస్‌లపై పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఈ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను అభివృద్ధి చేశారని.. ప్రమాదవశాత్తు ఆ వైరస్ బయటికి వచ్చి ఆ దేశాన్నే కాటేసిందని స్పష్టం చేశాడు.