శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (14:15 IST)

తమలపాకుతో ఆరోగ్యం.. నోటి దుర్వాసన పరార్

తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచు వున్నాయి. జలుబు, దగ్గును పోగొట్టే గుణాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఉదర సంబంధిత రుగ్మతలను తమలపాకు తొలగిస్తుంది. తమలపాకు శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. క్యాన్సర్లను దూరం చేస్తుంది. అజీర్తికి చెక్ పెడుతుంది. తమలపాకును నమలడం ద్వారా నోటిపూత తొలగిపోతుంది. 
 
ఇంకా దంత చిగుళ్లకు మేలు చేస్తుంది. వాత సంబంధిత రోగాలను తమలపాకు దూరం చేస్తుంది. మెదడు, హృద్రోగం, కాలేయ వ్యాధులకు తమలపాకు చెక్ పెడుతుంది. రోజూ అరగ్లాసుడు తమలపాకు రసం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కానీ తమలపాకును మితంగా తీసుకోవడం ద్వారా వీర్యవృద్ధి కలుగుతుంది. సంతానలేమిని ఇది దూరం చేస్తుంది. నోటి దుర్వాసనకు తమలపాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
తమలపాకు రసం అరగ్లాసుడు, నీరు, పాలు సమపాళ్లలో కలుపుకుని తీసుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. ఆవనూనెలో తమలపాకును వేసి వేడి చేసి ఛాతిపై రాస్తే జలుబు మాయమవుతుంది. తమలపాకు రసంలో కాస్త కస్తూరి పసుపు, తేనెను చేర్చి పేస్టులా చేర్చి పిల్లలకు ఇవ్వడం ద్వారా జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.