Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట నిద్రపోతున్నారా? లేదా..?

Written By సందీప్
Updated: గురువారం, 28 మార్చి 2019 (11:36 IST)
ప్రతి చిన్న విషయానికి కోపగించుకుంటున్నారా, చిరాకుగా ఉందా? పని మీద మీరు శ్రద్ధ పెట్టలేకపోతున్నారా? ఎవరైనా మాట్లాడితే విసుగ్గా ఉంటోందా? వీటన్నిటికీ కారణం సరిగ్గా నిద్రపోకపోవడమే. నిద్రలేమి మీకు కలిగించే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. నిద్రలేమితో బాధపడేవారు అనుభవించే నరకం చెప్పడానికి సాధ్యం కాదు. 
 
పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
 
రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో ఉంటారని తెలిపింది. సాధారణంగా అలసిపోతే చికాకు కనిపిస్తుంది. అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగానే తమ ప్రతాపాన్ని ఎదుట వారిపై చూపిస్తారని పరిశోధనల్లో తేలింది.
 
 కొంత మంది పరిశోధకులు కొందరిని ఎంపిక చేసి రెండు రోజులపాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు. కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే. నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోవాలి. కడుపు సరిపడా పౌష్టికాహారం తినండి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, సరదాగా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు.

అన్నీ చూడండి

September 01, 2026: మంగళవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అయ్యొయ్యో... అన్యాయంగా చంపేసాడు, వీడియో

నెల్లూరులో రౌడీ షీటర్‌ను రాళ్లతోనే కొట్టి చంపేశారు.. తల్లిని చంపాడు.. చివరికి..?

ఉజ్జయిని శ్మశానం కాలుతున్న శవం నుంచి మాంసం తింటున్న లేడీ అఘోరీ

121 స్పా, మసాజ్ సెంటర్లపై ఏకకాలంలో దాడి.. వైజాగ్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్

అన్నీ చూడండి

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న మూవీ హతః టైటిల్ ప్రకటన

NBK111 ఫ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

Kaala Bhairava: కావ్య కళ్యాణ్‌రామ్, కాల భైరవ ఇస్టపడ్డారు త్వరలో పెండ్లి

అన్ని అంశాలతో మ్యూజికల్ డ్రామా గా జగమే సంగీతం : పల్నాటి సూర్య ప్రతాప్

Nagababu: నాగబాబు, కేఎస్ రవి కుమార్ అతిథులుగా వేట చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments