Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో శరీరానికే కాదు.. కేశాలకు కూడా ఇబ్బందే.. ఎలా?

Written By chitra
Updated: బుధవారం, 27 ఏప్రియల్ 2016 (16:39 IST)
వేసవి కాలంలో శరీరాన్ని మాత్రమే కాదు జుట్టును కూడా చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. వేసవి కాలం మొదలైందంటే చాలు శరీరంలోని నీరంత ఆవిరైపోతుంది. దాంతో శరీరం పొడిబారుతుంది. రాషెష్‌ ఏర్పడుతాయి. చిరాకు కలిగిస్తాయి. ఒక్క శరీరానికి మాత్రమే కాదు. కేశాలకు కూడా వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. వేసవి కాలంలో కేశ సంరక్షణకు తీసుకొనే కొన్ని జాగ్రత్తల్లో కొన్నిమెళకువలు తెలుసుకొని ఉండాలి. 
 
అప్పుడు కేశాలతో పాటు మాడును కూడా చల్లగా ఉంచుకోగలుగుతారు. శరీరం కూల్‌‌గా ఉంచుకోవడానికి సీజన్‌ బట్టి పండ్లు కూరగాయలు, డ్రింక్స్‌ ఇలా ఎన్నో మార్పులు చేసుకుంటాం. అయితే కేశ సంరక్షణలో కూడా సరైన ఆహారపు అలవాట్లతో పాటు చల్లని హెయిర్‌ ప్యాక్స్‌ వేసుకోవడం చాలా అవసరం. ఈ సమ్మర్‌ హెయిర్‌ ప్యాక్స్‌‌ను తలకు వాడటం వల్ల తల మాడును వేడి నుండి రక్షించి కూల్‌గా ఉంచుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం!
 
1. ఒక బౌల్‌ తీసుకొని అందులో గుడ్డు పగులగొట్టి పసుపుగా ఉన్న సొన మాత్రమే వేయాలి. తర్వాత దానికి 2 చెంచాల తేనె, 2 చెంచాల ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా మిక్స్‌ చేస్తూ గిలకొట్టాలి. ఇప్పుడు ఈ సమ్మర్‌ హెయిర్‌ ప్యాక్‌కు తలకు బాగా పట్టించి 10 నిముషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్‌ ప్యాక్‌ తలకు చల్లదన్నాన్ని ఇవ్వడంతో పాటు కేశాలు మెరిసేలా చేస్తాయి. 
 
2. కొబ్బరి నూనె రెడ్‌ వైన్‌ రెండూ సమానంగా భాగాలుగా తీసుకొని బాగా మిక్స్‌ చేసి తలకు పట్టించాలి. ఈ సమ్మర్‌ హెయిర్‌ ప్యాక్‌ చిక్కగా లేకపోయినా తలకు పట్టించడం వల్ల కారిపోతుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు హెయిర్‌‌కు ప్యాక్‌ వేసి షవర్‌ క్యాప్‌‌ను ధరించాలి. 10 నిముషాల తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్‌ ప్యాక్‌ వల్ల తల చాలా కూల్‌‌గా విశ్రాంతి పొందుతుంది.

అన్నీ చూడండి

మమతా బెనర్జీ కారుపై దాడి - వీడియో వైరల్

ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రాహుల్ గాంధీ

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ ప్రకటనలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు

ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments