చక్కెర అధికంగా తీసుకునేవారు ఇది ఖచ్చితంగా చదవాలి?

బుధవారం, 4 డిశెంబరు 2019 (21:17 IST)
శరీరంలోని ప్రతి భాగం మీద చక్కెరల ప్రభావం పడుతుందని అంటున్నారు వైద్యులు. తొలి ప్రభావం దంతాల మీద, పుచ్చుపళ్ళు ఏర్పడడానికి కారణం తీసి పదార్థమేనట. కాఫీ, టీలతో సహా మనం తీసుకునే పదార్థాలలోని చక్కెర మీద ఆధారపడి నోటిలో ఉండే సూక్ష్మ జీవులు సంఖ్య వృద్థి అవుతాయట. 
 
ఆ సంఖ్య పెరిగితే దంతాల మీద పచ్చగా గార ఏర్పడుతుందట. ఆ గారలోని వెలువడే ఆమ్లాలు దంతం మీదుంటే రక్షిత పొరను కలిగిస్తుందట. ఫలితంగా సూక్ష్మ రంధ్రాలు దంతం మీద ఏర్పడి అవి పెద్దవై క్యావిటీగా మారతాయి. దంతాల చిగుళ్ళ నుండి రక్తస్రావానికి కారణం చక్కెరలని తెలియదు. నోటిలోకి చేరే చక్కెరలు అధికమైతే చిగుళ్ళు దెబ్బతింటాయి. పలు రకాల దంత వ్యాధులు వస్తాయట. రక్తస్రావం జరుగుతుందట.
 
అంతే కాదు కీలక అంగాలైన కాలేయం, గుండె మీద చక్కెరల ప్రభావం తీవ్రంగా ఉంటుందట. పండ్లలో సహజంగా ఉండే చక్కెర ప్ఱక్టోజ్. మిగిలిన చక్కెరలకు భిన్నంగా ఈ ఫ్రక్టోజ్ అనేది కాలేయం ద్వారా మార్పులకు గురవుతుందట. కృత్రిమంగా తయారు చేస్తున్న ఆహార పదార్థాలలో ఈ ఫ్రక్టోజ్ షుగర్స్ అధికం.
 
ఈ తీపి పదార్థాల ప్రభావాన కాలేయం దెబ్బతింటుందట. మత్తు పానీయాలు తాగేవారి కాలేయం ఎలా దెబ్బతింటుందో చక్కెరలు అధికంగా తిన్నా అంతేనట. పొట్ట పెరగడంలోను చక్కెర పాత్ర ఉంటుందని గుర్తించాలంటున్నారు వైద్యులు. రక్తపోటుకు ఉప్పు కారణం అనుకుంటుంటారు. కానీ అధిక రక్తపోటు రావటానికి ఉప్పు కన్నా చక్కరలే అధిక కారణం అంటున్నారు. 
 
రక్తపోటు 90/60 నుండి 120/80 మధ్య ఉంటుంది. చక్కెరలు అధికంగా తీసుకునేవారిలో ఆ రక్తపోటు గరిష్టమైన 120/80 వైపుకు మళ్ళతుందట. చక్కెరలు అధికంగా తినేవారిలో రక్తపోటులో మార్పులు వస్తాయని, ఆ మార్పులు ఉప్పు వల్ల వచ్చే దాని కన్నా అధిక మంటున్నారు వైద్య నిపుణులు.

అన్నీ చూడండి

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments