చిటికెలో నిద్రలోకి జారుకోవడానికి అద్భుతమైన టెక్నిక్...

సాధారణంగా కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడు. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోయినా ఆఫీసులో కునికిపాట్లు మరియు తలనొప్పి తప్పవు. అయితే నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి వల్ల కావచ్చు లేదా స్మార్ట్‌ఫోన్‌ల వలన కావచ్చు మనిషి నిద్రపోయే సమయం తగ్గిపోతోంది

మంగళవారం, 1 ఆగస్టు 2017 (18:02 IST)
సాధారణంగా కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడు. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోయినా ఆఫీసులో కునికిపాట్లు మరియు తలనొప్పి తప్పవు. అయితే నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి వల్ల కావచ్చు లేదా స్మార్ట్‌ఫోన్‌ల వలన కావచ్చు మనిషి నిద్రపోయే సమయం తగ్గిపోతోంది. దీని వలన అనేక రోగాల బారిన పడుతున్నారు. 
 
ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్రపట్టదు. అలాంటప్పుడు ఈ '4-7-8 బ్రీతింగ్ టెక్నిక్' మీకు బాగా ఉపయోగపడుతుంది. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఆండ్రూ వెయిల్ ఈ ట్రిక్‌ను క‌నుగొన్నారు. నోటి లోప‌ల పై భాగాన్ని ట‌చ్ చేసేలా నాలుక‌ను ఉంచాలి. ఆ తర్వాత 4 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోపలికి పీల్చాలి. 
 
అనంత‌రం 7 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోప‌ల అలాగే బంధించాలి. త‌ర్వాత 8 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ మొత్తాన్ని నోటి ద్వారా పెద్ద‌గా విజిల్ సౌండ్ మాదిరిగా వ‌చ్చేలా గాలిని బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. ఇలా రోజుకు 2 నుండి 4 సార్లు చేస్తే మీలో మార్పును గ‌మ‌నిస్తారు. కేవలం కొన్ని సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటారు. మీరు ఆందోళనగా ఉన్నప్పుడు ప్రతిస్పందించడానికి ముందు దీన్ని పాటించండి. టెన్షన్‌గా ఉన్నప్పుడు చేయండి. ఉపశమనం దొరుకుతుంది.

అన్నీ చూడండి

పెళ్లిలో ఏంటి ఈ వెకిలి డ్యాన్సులు? వధువును మందలించిన వరుడు, పెళ్లి కేన్సిల్ చేసిన పిల్ల తండ్రి

జనసేనాని పవన్‌కు కాంగ్రెస్ ఆఫర్.. ఓకే అంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం..?

కోడలికి మళ్లీ పెళ్ళి చేసిన మామ.. ఎక్కడ?

ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందంటూ ఇజ్రాయెల్ రహస్య నివేదిక

ఏపీలో కరోనా కలకలం: కోవిడ్ లక్షణాలతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?

Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్

రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్

శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మిస్టర్ మిడిల్ క్లాస్

Nikhil: రోషన్ కనకాల హీరోగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments