బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 జనవరి 2024 (23:07 IST)

ఈ 2024 కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా వుండేందుకు చిట్కాలు

health tips
నూతన సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆరోగ్యవంతులుగా వుండవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. ఎత్తుకు తగిన బరువు వుండేట్లు చూసుకుంటూ వుండాలి.
 
అనారోగ్యకరమైన ఆహారాన్ని పరిమితం చేసి ఆరోగ్యకరమైన భోజనం తినాలి. మల్టీవిటమిన్ సప్లిమెంట్లను అవసరాన్ని బట్టి తీసుకోవాలి. మంచినీరు త్రాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలి, శీతల పానీయాలను పరిమితం చేయాలి.
 
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి. గంటలపాటు కుర్చీకి అతుక్కుపోయి కూర్చోరాదు, అలాగే స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. తగినంత మంచి నిద్ర పొందేందుకు ఉదయాన్నే త్వరగా లేచి రాత్రి త్వరగా నిద్రపోవాలి. మద్యపానం, ధూమపానం అలవాట్లున్నవారు వాటిని వదిలేయాలి.