శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (13:05 IST)

ఆ రకం మహిళలే హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ బారిన పడుతారట...

విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్తమార్పిడి వల్ల, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, హెచ్ఐవి వైరస్ (ఎయిడ్స్) వ్యాపిస్తుంది. భారతదేశంలో

విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్తమార్పిడి వల్ల, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, హెచ్ఐవి వైరస్ (ఎయిడ్స్) వ్యాపిస్తుంది. భారతదేశంలో చాప కింద నీరులా ఎయిడ్స్ వ్యాపిస్తోందని గత దశాబ్దంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఎయిడ్స్ ఒక ప్రాణాంతకమైన, చికిత్సలేని సుఖ వ్యాధి. 
 
అయితే, ఈ హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మద్యం సేవించి శృంగారంలో పాల్గొనే మహిళల్లో వ్యాపిస్తుందట. బిహేవియరల్ మెడిసిన్ జర్నల్ జరిపిన ఈ స్టడీలో మొత్తం 287 మంది మద్యం అలవాటున్న యువతులను ఎంపిక చేసి వారిని పరీక్షించగా, పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో రెచ్చిపోయే ధోరణిని ప్రదర్శించే యువతులు, సురక్షిత మార్గాలను దూరం పెడతారని తేల్చారు. అనురక్షిత లైంగిక చర్యలకు దిగి, ప్రాణాంతక రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది.