బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 ఏప్రియల్ 2024 (15:46 IST)

ప్రతిరోజూ 3,500 మందిని కబళిస్తున్న హెపటైటిస్ వైరస్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ

hepatitis
ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రతిరోజూ 3,500 మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో తెలిపింది. హెపటైటిస్ బి నుండి 83 శాతం, హెపటైటిస్ సి నుండి 17 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు వెల్లడించింది. ఈ హెపటైటిస్ వైరస్ అనేది రెండవ అతిపెద్ద కిల్లర్‌ అనీ, దీన్ని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
 
పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ హెపటైటిస్ సమావేశంలో విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా వున్నాయి. 2019లో 1.1 మిలియన్ల మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇక 2022లో ఈ సంఖ్య 1.3 మిలియన్లకు పెరిగిందని 187 దేశాల నుండి వచ్చిన సమాచారాన్ని వెల్లడించింది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లకు పలు కారణాలుంటున్నట్లు తెలిపింది.
 
ఈ వైరస్‌లకు చికిత్స చేయగల సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక హెపటైటిస్ బి ఉన్నవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే 2022 చివరి నాటికి యాంటీవైరల్ చికిత్స పొందారని నివేదిక పేర్కొంది. దీనికి కారణం వ్యాధి నిర్థారణలో జరుగుతున్న జాప్యం కారణమని చెప్పారు.