Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ తింటుంటారు కానీ ప్రయోజనాలేమిటో తెలుసా?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:21 IST)
ఓట్స్ మంచి పౌష్ఠికాహారం. దీనిలో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా ఎక్కువే. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌తో రకరకాల రుచికరమైన తినుబండారాలు చేయవచ్చు సగం కప్పు ఉడికించిన ఓట్స్‌లో 80 కేలరీలు మాత్రమే ఉంటాయ. నీటిలో కరిగే పీచుతో పాటు కరగని పీచు కూడా వీటిలో ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. ఇన్ని పోషక విలువలు కలిగిన ఓట్స్ గురించి మరికొంత సమాచారం.
 
1. ఓట్స్‌ మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర మోతాదు హఠాత్తుగా పెరగకుండా చేస్తాయి. నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి కాబట్టి మధుమేహం రాకుండానూ కాపాడతాయి.
 
2. ఓట్స్‌లో జింక్‌, విటమిన్‌ ఇ, సెలీనియం కూడా ఎక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ మంచి ఆహారం. ఓట్స్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
 
3. అంతేగాక రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంచుతుంది. ఓట్స్‌లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. 
 
4. ఓట్స్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ఓట్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
5. ఓట్స్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.

అన్నీ చూడండి

శ్రీకాళహస్తి.. సెప్టిక్ ట్యాంక్ వద్ద నవజాత శిశువు.. ఎవరు వదిలిపెట్టారు?

యువతలో రీల్స్ పిచ్చి.. పార్కులో జుట్టుపట్టుకుని కొట్టుకున్న యువతులు (వీడియో)

బైకును ఢీకొన్న కారు.. తండ్రి మృతి... కుమారుడు సేఫ్.. బ్యాడ్మింటన్ క్లాస్‌కు..?

పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మేకపాటి ఫ్యామిలీ?

కూతురిని వేధించిన రైఫిల్ షూటింగ్ కోచ్.. గోదావరిలో దూకిన ఏఈ ఫ్యామిలీ.. మనవడి మాటలు?

అన్నీ చూడండి

టైమ్స్ స్క్వేర్‌లో జెండా ఎగురవేతకు ముఖ్య అతిథిగా బుట్టబొమ్మ.. డ్యాన్స్ అదుర్స్ (video)

పవన్ కళ్యాణ్ గారు మోదీ ని కలిసినప్పుడు నేనిచ్చిన స్కోర్ నచ్చి పిలిపించారు : అజయ్ అరసాడ

Anirudh and Kavya : గ్రీస్ లో అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం జరగనుందా ?

Nidhhi Agerwal: పుట్టినరోజున కొత్త చిత్రాన్ని ప్రారంభించిన నిధి అగర్వాల్

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

తర్వాతి కథనం
Show comments