ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జులై 2016 (12:32 IST)

హాయిగా నిద్రపోవాలనుందా? అయితే కాళ్ళకు చెప్పులు లేకుండా నడవండి!

మనలో చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాలికి చెప్పులు లేకుండా అడుగుతీసి అడుగు వేయరు. కేవలం వీధులు, రోడ్లపైనే కాకుండా, ఇంటి హాలులో, కిచెన్, పడక గదిలో కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు.

మనలో చాలామంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాలికి చెప్పులు లేకుండా అడుగుతీసి అడుగు వేయరు. కేవలం వీధులు, రోడ్లపైనే కాకుండా, ఇంటి హాలులో, కిచెన్, పడక గదిలో కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. నిజానికి చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
రోజులో కొద్దిసేపు అయినా పాదరక్షలు లేకుండా నడవడం వల్ల కాలి కండరాలకు ఆక్సిజన్‌ పుష్కలంగా అందుతుంది. అరికాలి మంటలూ, నొప్పులూ ఉన్నవారికి ఎంతగానో దోహదపడుతుంది. అయితే, కండరాల బలహీనత ఉన్నవారికి కూడా కాలినడక అంత మంచిది కాదు. మధుమేహం వంటివి ఉంటే మాత్రం చెప్పులు లేకుండా నడవరాదు. 
 
ఇక మట్టిలో, ఇసుకలో, పచ్చికలో చెప్పులు లేకుండా నడవడం వల్ల అది మెదడుని ప్రభావితం చేస్తుందట. కలతలు లేని మంచి నిద్ర పోవాలన్నా... ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా ఒట్టిపాదాల నడక ఎంతో అవసరం. అయితే ఒక్క విషయం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. నేలమీద నడవడం అంటే సిమెంట్‌ నేలపైనో, గ్రానైట్‌రాళ్లపైనో నడవడంకాదు. ప్రకృతికి దగ్గరగా మట్టినేలపై అని అర్థం.
 
వయసు మళ్లిన వాళ్లు కూడా వైద్యుల సలహామేరకు ఇంటి తోటలో కాసేపు నడవొచ్చు. చెప్పుల్లేకుండా నడవడం వల్ల వెన్ను మోకాళ్ల బాధల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే, శరీరంలోని లిగమెంట్లూ, కండరాలూ, కీళ్లూ శక్తిమంతం అవ్వాలంటే ప్రతి రోజూ కాకపోయినా నిర్ణీత సమయంలో వారానికోసారి కాసేపు నడవడం ఎంతో ముఖ్యమని వైద్యులు చెపుతున్నారు.