శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By JSK
Last Modified: బుధవారం, 27 జులై 2016 (14:25 IST)

పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి వీర్యం నీళ్ళ‌లా ఉండ‌ట‌మే కార‌ణం... అయితే...?

వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడికి గురి చేసే సమస్యల వల్ల, పౌష్టికాహారలోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యలు వ‌స్తున్నాయి. వయసు మీరిన తర్వాత అంటే 40 ఏళ్లు పైబడిన తర్వాత సమస్య ఏర్పడవచ్చు. రెండోది పుట్టుకతోనే అవయవాల లోప

వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడికి గురి చేసే సమస్యల వల్ల, పౌష్టికాహారలోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యలు వ‌స్తున్నాయి. వయసు మీరిన తర్వాత అంటే 40 ఏళ్లు పైబడిన తర్వాత సమస్య ఏర్పడవచ్చు. రెండోది పుట్టుకతోనే అవయవాల లోపం వల్ల, జననేంద్రియాల్లో గానీ, పిట్యూటరీ గ్రంధిలో సమస్య వల్ల గానీ, అవయవాల పెరుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల గానీ సంతానలేమి సమస్యకు దారితీస్తుంది. అధిక మానసిక ఒత్తిడివల్ల, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల, పొల్యూషన్ వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గి సంతానలేమికి కారణం అవుతాయి. 
 
సెమన్ పల్చగా ఉండటం వల్ల కూడా దీన్ని ఒక సెక్యువల్ సమస్యగా నిర్థారిస్తారు. వీర్యం పల్చగా ఉంటే పిల్లలు పుట్టడం కష్టం. లో స్పెర్మ్ కౌంట్, స్మోకింగ్, డ్రగ్స్ తీసుకోవడం, స్ట్రెస్, హార్మోనుల్లో మార్పులు, ఫ్రక్టోజ్ లోపం మరియు పూర్ డైట్ ప్లాన్ వల్ల‌ సెమన్ పల్చగా ఉంటుంది. అలాగే ఎక్కువగా సెక్స్‌లో పాల్గొనడం మరియు ఫ్రీక్వెంట్‌గా హస్త ప్రయోగం వల్ల వీర్యం పల్చగా మారుతుంది. స్పెర్మ్ క్వాలిటి, క్వాంటిటీ తగ్గడం వల్ల పురుషుల్లో పునరుత్పత్తి లోపిస్తుంది. కాబట్టి, అలా జరగకుండా నివారించాలంటే కొన్ని నేచురల్ హోం రెమెడీస్
 
* జింక్ అధికంగా ఉండే ఆహారాలు ఓయిస్ట్రెస్, ల్యాంబ్ మటన్, బాదం, పీనట్స్, ఫైన్ నట్స్, జీడిపప్పు, మరియు సన్ ఫ్లవర్ సీడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వ‌ల్ల సెమన్ క్వాలిటీ, క్వాంటిటి పెంచుకోవచ్చు.
* ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల సెమన్ చిక్కగా మారుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉండే ఆపిల్, బెర్రీస్, పియర్స్, గ్రేప్స్, డేట్స్, జామ, మామిడి, పైనాపిల్ మరియు వాటర్ మెలోన్ క్యాబేజ్, టమోటో, లెట్యుస్, ఉల్లిపాయలను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకోవాలి.
 
* బాడీ మజిల్స్‌ను బలోపేతం చేయాలంటే రెగ్యులర్‌గా వ్యాయామం చెయ్యాలి. ఇలా చేయ‌డం వల్ల శరీరంలో సెమెన్ హెల్తీగా ఉత్పత్తయ్యి, సెమన్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి కారణమయ్యే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. 
* రెగ్యులర్‌గా సరైన నిద్రలేకపోతే మెద‌డు ప‌నితీరుపై మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సెక్స్ హార్మోనులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజూ 6-8గంటల నిద్ర చాలా అవసరం.
* కొన్ని సందర్భాల్లో విటమిన్స్ లోపం వల్ల కూడా సెమన్ పల్చగా మారుతుంది. విటమిన్ సి, ఇ, బి12 అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ లోపాలను తగ్గించుకోవచ్చు.
* పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థ సరిగా పని చేయాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల హార్మోనుల్లో వచ్చే మార్పుల వల్ల సెమెన్ క్వాలిటీలో మార్పులు వస్తాయి.
 
* ఎండు ఖర్జూరాలను రెండుమూడు గంటల సేపు పాలలో నానబెట్టి వీటిని మెత్తగా పేస్ట్ చేసి, పాలతో పాటు క‌లిపి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. ఇంకా ఇందులో విటమిన్ బి1, బి2, బి5లు అధికంగా ఉండ‌టం వ‌ల్ల‌ సెక్సువల్ స్టామినా పెంచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
* సెలీనియ్ అధికంగా ఉండే బ్రాజిల్ నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి, చేపలు, సార్డిన్స్, ఓయిస్ట్రెస్, మటన్, చికెన్, గుడ్డు, వీట్ గ్రామ్, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్, మరియు ఉల్లిపాయ వంటి ఆహారాలు రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వ‌ల్ల వీర్యం చిక్కగా మారుతుంది.
* కొన్ని సందర్భాల్లో విటమిన్స్ లోపం వల్ల కూడా సెమన్ పల్చగా మారుతుంది. విటమిన్ సి, ఇ, బి12 అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ లోపాలను తగ్గించుకోవచ్చు.
 
* పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థ సరిగా పనిచేయాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల హార్మోనుల్లో వచ్చే మార్పుల వల్ల సెమెన్ క్వాలిటీలో మార్పులు వస్తాయి.
* బాడీ మజిల్స్‌ను బలోపేతం చేయాలంటే రెగ్యులర్‌గా వ్యాయామం చెయ్యాలి. ఇలా చేయ‌డం వల్ల శరీరంలో సెమెన్ హెల్తీగా ఉత్పత్తయి, సెమన్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి కారణమయ్యే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
* రెగ్యులర్‌గా సరైన నిద్రలేకపోతే మెద‌డు ప‌నితీరుపై మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సెక్స్ హార్మోనులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజూ 6-8గంటల నిద్ర చాలా అవసరం.