శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (21:38 IST)

కొబ్బరినూనె తలకు మాత్రమే కాదు... మరెన్నో ఉపయోగాలు....

మనం ప్రతి రోజు వాడుకునే కొబ్బరి నూనె వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం తలకు మాత్రమే కాదు బాడీ లోషన్‌గా కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు, చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. ఇది మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కాస్త

మనం ప్రతి రోజు వాడుకునే కొబ్బరి నూనె వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం తలకు మాత్రమే కాదు బాడీ లోషన్‌గా కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు, చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. ఇది మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. కాస్త జిడ్డుగా అనిపించినా తర్వాత అది చర్మంలోకి ఇంకిపోయి ఎలాంటి ఇబ్బంది ఉండదు . ఇది రాసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
 
1. కళ్లకు రాసుకున్న కాటుక, ఐలైనర్ కొన్నిసార్లు ఒక పట్టాన వదలవు. అలాంటప్పుడు దూది ఉండను కొబ్బరి నూనెలో ముంచి కళ్లపై అద్దాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
2. కొబ్బరినూనె, తేనెను సమపాళ్లలో తీసుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయండి. దీనివల్ల ముఖంలో కొత్తమెరుపు వస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది.
 
3. కొబ్బరి నూనె పెదాలకు కావల్సిన తేమను అందిస్తుంది. లిప్ బామ్‌కు బదులు కాస్త కొబ్బరి నూనె రాసుకుంటే పెదాలు పొడిబారడం తగ్గుతాయి.
 
4. కొబ్బరినూనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీసెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. దీనిని ముఖానికి రాసుకోవడం వల్ల పాడైన చర్మం మంచిగా తయారవుతుంది.
 
5. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెలో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే చర్మం తెల్లగా, తాజాగా, అందంగా ఉంటుంది.