మొండి చుండ్రు... వదలగొట్టేది ఎలా...?

చుండ్రు సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. ఈ సమస్యను వదిలించుకునేందుకు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. * నిమ్మరసాన్ని మాడుకి పట్టించి పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది. * ఒక గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు

గురువారం, 26 మే 2016 (21:12 IST)
చుండ్రు సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. ఈ సమస్యను వదిలించుకునేందుకు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
 
* నిమ్మరసాన్ని మాడుకి పట్టించి పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది.
* ఒక గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు చిక్కటి రంగులోకి మారే వరకు ఉడికించాలి. ఈ నీళ్లతో మాడుపై మర్దనా చేసి అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండు పోతుంది (మర్దనా చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నుదుటి మీదకి నీళ్లు కారకుండా చూసుకోవాలి.)
* మాడుపై ఉండే చర్మం పొడి బారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దనా చేసి వేడి నీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి.
 
* టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.
* బీర్‌లో విటమిన్ బి, ఈస్ట్‌లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రు కారకాలకు బద్ధశత్రువులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో మటుమాయమవుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకి పట్టిన చుండ్రు వదులుతుంది.
* పైన చెప్పినవన్నీ చుండ్రు వచ్చాక దాన్ని పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చుండ్రు అసలు రాకుండా ఉండాలంటే నీళ్లు సరిపడా తాగాలి. సమతులాహారాన్ని తినాలి. బి విటమిన్, జింక్‌లను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు పోవడంతో పాటు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

అన్నీ చూడండి

సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?

బిర్యానీ విషయంలో గొడవ: దంపతుల ఆత్మహత్య.. నాలుగేళ్ల కుమారుడి ముందే..?

Minor girl: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై భవనం పైనుంచి కిందకు తోసేశాడు..

కుక్క కరిచిన వ్యక్తి ఎలా అయిపోయాడో చూడండి, వీడియో

ఒకే రూటులో జగన్, కేసీఆర్.. ఆ యాత్రలు వారికి కలిసొస్తాయా? లేదా?

అన్నీ చూడండి

స్నేహితురాలి అంత్యక్రియల్లో బోరున విలపించిన సల్మాన్ ఖాన్

బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సిద్ధుగాడి లవ్ స్టోరీ

Niharika Konidela: వంద దేవుళ్ళు ట్రైలర్ చూశాక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా వుంది : నిహారిక కొణిదెల

Sundeep Kishan: 5 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన సందీప్ కిషన్.. సిగ్మా ఫస్ట్ సింగిల్

Vimal Krishna: ప్రేయసిని కూడా అనుమానించే అనుమాన పక్షి గా విమల్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments