1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 6 మార్చి 2017 (22:27 IST)

ఆ రకం వంకాయతో ఎలర్జీ వస్తుంది జాగ్రత్త...

వంకాయల్లో ఐదు రకాలున్నాయి. వంకాయలతో కూరలు, పచ్చళ్లు చేసుకుని తింటూ వుంటాం. ఐతే శాస్త్రీయ పరిశీలనల్లో వంకాయలను అతిగా వాడటం మంచిది కాదు. ఈ వంకాయలు కొందరిలో ఎలర్జీని కలిగిస్తాయి. అందువలన ఎలర్జీకి గురయ్యేవారు వంకాయ తిన్నప్పుడు వస్తుందేమో చూసుకుని దాన్ని

వంకాయల్లో ఐదు రకాలున్నాయి. వంకాయలతో కూరలు, పచ్చళ్లు చేసుకుని తింటూ వుంటాం. ఐతే శాస్త్రీయ పరిశీలనల్లో వంకాయలను అతిగా వాడటం మంచిది కాదు. ఈ వంకాయలు కొందరిలో ఎలర్జీని కలిగిస్తాయి. అందువలన ఎలర్జీకి గురయ్యేవారు వంకాయ తిన్నప్పుడు వస్తుందేమో చూసుకుని దాన్ని మానేయాలి. 
 
ఇకపోతే వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. తెలుపు రకం వంకాయలు అతిమూత్ర వ్యాధిగ్రస్తులకు మంచి మందులా పనిచేస్తుంది. అంతేకాదు వీర్యపుష్టిని కూడా ఇస్తుంది. వంకాయ మొక్కల ఆకు రసంలో కూడా ఎన్నో ఔషధ గుణాలుండటంతో దాన్ని మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు.