1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Do you know how long to take food after drinking fresh water?

మంచినీరు తాగాక ఎంతసేపటికి ఆహారం తీసుకోవాలో తెలుసా?

food
ప్రస్తుత కాలంలో ఖరీదైన జీవితానికి అలవాటుపడిన మనిషికి తాగే నీటి ఆవశ్యకత తెలియక రోగాల పాలవుతున్నారు. నీటికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడు వంతుల నీటిని పుచ్చుకోవడం శరీర ధర్మం. 
 
1. పెద్దవారు కనీసం ఐదు లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు నీళ్లును తాగితే శరీరం సమతుల్యంగా ఉంటుంది.
2. పిల్లల విషయానికొస్తే వారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి వారు రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి.
3. ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు నీళ్లను త్రాగాలి.
4. నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్ధమూ తీసుకోకూడదు.
5. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే పదార్ధాలను అంటే ఆకుకూర, పండ్లలో కూడా 70 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
తర్వాతి కథనం
లాక్ డౌన్‌లో వున్నారుగా.. పిల్లలకు పిస్తా పెట్టండి..