గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:54 IST)

పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టిన ప్రభాస్ పెద్దమ్మ!

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా పోలీసులు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. లాక్‌డౌన్ నియమాలను కఠినంగా అమలు చేస్తూ, పౌరులను రోడ్లపైకి తిరగకుండా చేస్తున్నారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా పోలీసుకు సరైన అన్నపానీయాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. 
 
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు భార్య, టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ పెద్దమ్మ అయిన శ్యామలాదేవి తమ ఇంటి పరిసరాలలో విధులు నిర్వహించే పోలీసులకు మటన్ బిర్యానీ వండిపెట్టారు. ఈ డమ్ మటన్ బిర్యానీని ఆమె స్వయంగా తయారు చేశారు. ఈ బిర్యానీని ఆరగించిన పోలీసులు భలేవుందంటూ బిర్యానీని ఆరగించారట. 
 
ఈ సందర్భంగా ఆమె పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటా సమాజానికి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.