శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (17:23 IST)

సామాజిక దూరం పాటించిన కోతులు.. ఎలాగో ఈ ఫోటో చూడండి..

monkey
చైనాలోని వుహాన్ నగరంలో గత ఏడాది డిసెంబర్ నెలలో కరోనా మహమ్మారి పుట్టుకొచ్చింది. ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. అమెరికా, ఇటలీ, ఇంగ్లండ్, ఇరాన్, స్పెయిన్ వంటి పలు దేశాలకు వ్యాపించిన ఈ కరోనా వైరస్‌తో జనాలు జడుసుకుంటున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ వైరస్ నుంచి తమను తాము రక్షించుకునేందుకు.. సామాజిక దూరం పాటిస్తున్నారు. 
 
లాక్ డౌన్ కారణంగా పక్షులు, జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయి. దీన్ని గమనించిన కన్నడ నటుడు చందన్ కుమార్ నంది కొండలో ఆకలితో అలమటిస్తున్న 500 కోతులకు అరటి పండు, పుచ్చకాయ, ఖర్భూజ పండ్లను బండిలో తీసుకెళ్లి అందజేశారు. దాదాపు నాలుగు గంటల పాటు అడవిలోని కోతులకు ఆయన ఆహారం అందించాడు. 
 
ఆ సమయంలో కోతులన్నీ సామాజిక దూరం పాటించాయని.. అలా ఆ కోతుల నుంచి తాను సోషల్ డిస్టన్స్ నేర్చుకున్నానని తెలిపాడు. దీంతో చందన్‌పై సెలెబ్రిటీలు పలువురు అభినందనలు, ప్రశంసలు కురిపిస్తున్నారు.