1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ttdj
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2016 (18:17 IST)

రాగులు నానబెట్టి మొలకలొచ్చాక ఎండించి పిండి చేసి తింటే...

మన శరీరం ఎలాంటి అనారోగ్యాన్నయినా ఎదుర్కోవటానికి దృఢంగా ఉండాలి. దృఢమైన శరీరం గల వారు రోగాలను ఎదుర్కొనగలరు. శరీరం దృఢంగా ఉండాలంటే రాగులని మన ఆహారంతో తీసుకోవాలి. వివిధ రోగాలకి రాగులు బాగా పనిచేస్తాయి. మొక్కగట్టిన ధ్యానం పిండిని రాగిమాల్ట్ అంటారు. రాగుల్

మన శరీరం ఎలాంటి అనారోగ్యాన్నయినా ఎదుర్కోవటానికి దృఢంగా ఉండాలి. దృఢమైన శరీరం గల వారు రోగాలను ఎదుర్కొనగలరు. శరీరం దృఢంగా ఉండాలంటే రాగులని మన ఆహారంతో తీసుకోవాలి. వివిధ రోగాలకి రాగులు బాగా పనిచేస్తాయి. మొక్కగట్టిన ధ్యానం పిండిని రాగిమాల్ట్ అంటారు. రాగుల్ని బాగు చేసి నీళ్ళలో నానబెట్టి నాలుగు గంటల తరువాత గుడ్డలో వేసి మూటగట్టి పైన బరువు ఉంచండి. రెండు మూడు రోజుల్లో చిన్న మొక్కలొస్తాయి. మొలకలొచ్చిన తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత దోరగా వేయించాలి. నూనె వెయ్యకుండా మామూలు మూకుడిలో వేయించి అలా వేగిన రాగుల్ని మర పట్టించాలి. ఆ పిండినే రాగిమాల్ట్ అంటారు. రాగి మాల్ట్ ని రోజుకు రెండుసార్లు పాలలో గాని, మజ్జిగలో గాని కలుపుకుని తాగాలి.
 
కడుపులో మంటకి, వాంతులు, వికారానికి, మలబద్థకం నివారణకి రాగిమాల్ట్ మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల ఆ వ్యాధులు త్వరగా తగ్గుతాయి. ఘుగర్‌, బిపి తగ్గటానికి రాగిమాల్ట్ వాడవచ్చు. రాగిమాల్ట్ తరుచూ తాగటం వల్ల చలువ చేస్తుంది. రక్తదోషాలన్నింటికి చాలా మంచిది. బొల్లి, సోరియాసిస్‌ మరియు ఇతర చర్మవ్యాధులలో బాధపడేవారు, సుగంధ పాలతో రాగిమాల్ట్ కలుపుకుని తాగితే ఆయా వ్యాధులు త్వరగా తగ్గుతాయి.