శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 5 జూన్ 2017 (21:19 IST)

విపరీతంగా బాధపెట్టే ఆస్త్మా(ఆయాసం)... ఈ చిట్కాలతో కట్...

ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు, ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది. ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూట

ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు, ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది.
 
ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది.
 
ఆయాసం ఉన్నవారు గోధుమ, శాలిధాన్యం, పక్షి మాంసం, లేత ముల్లంగి, వెలగపండు, తేనె వెల్లుల్లి తీసుకోవడం మంచిది.
 
అలాగే మినుములు, చేప, సొరకాయ, దంపకూరలు, బచ్చలి కూర, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, చన్నీటి స్నానం, మంచులో లేదా చల్లటి గాలిలో తిరగడం మంచిది కాదు.