శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (12:52 IST)

హడావుడి వద్దే వద్దు.. ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. సమయానికి నిద్ర లేవండి..

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. పక్కా ప్లాన్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. కార్యాలయాలు వెళ్ళే మహిళలు రోజూ హడావుడిగా కదలడం ద్వారా వారికి అనారోగ్య సమస్యలు తప్పవని.. అందుచేత చ

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. పక్కా ప్లాన్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. కార్యాలయాలు వెళ్ళే మహిళలు రోజూ హడావుడిగా కదలడం ద్వారా వారికి అనారోగ్య సమస్యలు తప్పవని.. అందుచేత చేసే పనిని సమయాన్ని వృదా చేసుకోకుండా చేసుకుంటే.. ఎలాంటి తలనొప్పులు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడాన్ని తగ్గించుకోవాలి. రాత్రి ఎంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని నిద్రిస్తారో ఆరోగ్యానికి అంత మేలు చేసినట్లవుతుంది. తద్వారా కంగారు, ఆందోళన తగ్గుతుంది. మర్నాడు హాయిగా నిద్రలేవొచ్చు. పనులూ చకచకా పూర్తవుతాయి. ప్రతి రోజూ ఒక సమయానికి నిద్ర లేవడం ద్వారా జీవక్రియల రేటు మెరుగవుతుంది. ఈ ప్రక్రియను కొనసాగించాలంటే.. సెలవు రోజూ ఉదయాన్నే లేవాలి.  
 
నిద్రలేవగానే బద్ధకం, మత్తుగా అనిపిస్తే దాన్ని వెంటనే వదిలించుకోవాలి. లేదంటే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఉదయం పూట సూర్మరశ్మి తగిలితే శరీరానికి నూతనోత్తేజం అందుతుంది, అసౌకర్యం దూరమవుతుంది. ఎండలో ఉండే 'డి' విటమిన్ ఒత్తిళ్లనూ దూరం చేస్తుంది.
 
ఎండ తగిలే అవకాశం లేని పక్షంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి ధ్యానం, పూజ... ఇలా ఏదో ఒక వ్యాపకం మీద దృష్టి పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గ్రీన్ టీనో, కాఫీనో తాగితే ఉత్సాహం వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.