తేనె, తులసి ఆకురసం కలిపి తీసుకుంటే....

నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది. తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుం

సోమవారం, 21 నవంబరు 2016 (22:33 IST)
నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది. 
 
తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది.
 
కంటికి అవసరమైన విటమిన్ "ఎ"ను శరీరం తీసుకునేందుకు సాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది. తేనె నీళ్లు పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతాయి. 
 
అంతేకాకుండా, రోజూ పావు గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ఒళ్లు తగ్గుతుంది. రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది.

అన్నీ చూడండి

ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు: మృతులంతా రోగులే...

ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదం, ఫార్చునర్ కారు డివైడర్‌ను ఢీకొని మరో కారుని ఢీకొట్టింది, ఇద్దరు మృతి

జూలై 19, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో 20 అడుగుల కొండచిలువ కలకలం, వీడియో

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

తర్వాతి కథనం
Show comments