Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధి అస్సలు రాకూడదంటే ఏం చేయాలి?

శత్రువైనా జాలి పడి వదిలేస్తాడు కానీ... షుగర్ వ్యాధి ఒకసారి వస్తే వదలదు. అలాంటి షుగర్ వచ్చేదాకా కాకుండా అసలు రాకుండా చూసుకుంటే పోలా.. దానికి అద్భుతమైన చిట్కా ఉంది. అది పాటిస్తే షుగర్ వ్యాధి రాదంటున్నారు వైద్యులు. ఒకవేళ షుగర్ వ్యాధి వచ్చి ఉంటే కంట్రోల్

Written By chj
Updated: సోమవారం, 5 జూన్ 2017 (13:00 IST)
శత్రువైనా జాలి పడి వదిలేస్తాడు కానీ... షుగర్ వ్యాధి ఒకసారి వస్తే వదలదు. అలాంటి షుగర్ వచ్చేదాకా కాకుండా అసలు రాకుండా చూసుకుంటే పోలా.. దానికి అద్భుతమైన చిట్కా ఉంది. అది పాటిస్తే షుగర్ వ్యాధి రాదంటున్నారు వైద్యులు. ఒకవేళ షుగర్ వ్యాధి వచ్చి ఉంటే కంట్రోల్‌లో ఉంటుంది. 
 
షుగర్ వ్యాధి రావడానికి ఆరు కారణాలున్నాయి. అధిక బరువు, ఆహార అలవాట్లు, శరీరానికి శ్రమ లేకుండా పోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, మానసిక ఒత్తిడి.. వీటివల్లే వస్తుంది. కొంతమందికి డయాబెటిస్ తల్లికి ఉన్నా.. తండ్రికి ఉన్నా వస్తుంది.  కొందరికి శరీరంలో ఇన్సూలిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వస్తుంది. దానికి ఇన్సూలిన్ తీసుకోవడమే మంచిది. శరీర కణాలు ఇన్సూలిన్ సరిగ్గా గ్రహించకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. దీని కారణంగానే ఎక్కువమందికి డయాబెటిస్ వస్తుంటుంది. నూటికి 95 శాతం మందికి ఈ కారణం వల్లే వస్తుంది. 
 
మితాహారం.. ఆకలి వేసినప్పుడే తినాలి. అది కూడా పొట్ట నిండుగా కాకుండా గ్యాప్ ఉండేలా తినాలి. సమతుల ఆహారం... తెల్లగా మల్లెపూలలా అన్నం వండుకుంటూ ఎప్పుడూ ఒకే రకమైన వంటలు వండుకుని అందులో ఇష్టమొచ్చినట్లు రుచికరమైన కూరలు, పచ్చళ్ళు వేసుకుని తినకూడదు. రాగులు, సజ్జలు, ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, చేపలు అన్ని పోషకాలు ఉన్న ఆహారం తినాలి. రోజుకు 40 నిమిషాలు వాకింగ్ ఖచ్చితంగా చెయ్యాలి. దీనివల్ల అధికబరువు తగ్గుతుంది. ఫలితంగా షుగర్ వచ్చే అవకాశం లేదు.
 
రోజుకు 10 నిమిషాలు ధ్యానం చెయ్యాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయండి. ఆల్కహాల్‌ను కూడా మానెయ్యాలి. వీటిని మానేయడం కష్టమనుకుంటే  ఆ తరువాత వచ్చే షుగర్ వ్యాధితో కలిగే బాధలే ఎక్కువ. ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే షుగర్ వ్యాధి దరిచేరదు. ఒకవేళ వచ్చివున్నా తగ్గిపోతుంది. సన్నగా ఉండండి.. చలాకీగా ఉండండి.. ఇదే ఆరోగ్య సూత్రం.

అన్నీ చూడండి

Pawan Kalyan, తీవ్రమైన జ్వరం, మళ్లీ భుజం నొప్పి వచ్చిందా, హుటాహుటిన హైదరాబాద్‌కి పవన్

పిల్లల ఆన్‌లైన్ భద్రతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక బలమైన సందేశం: చందన మారిపల్లి

హర్మూజ్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేరు : ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉద్యోగ ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి : బాబా రాందేవ్

ప్రభుత్వాలు మారినా పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు : అభిజీత్ దీప్కే

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments