పులిపిరి కాయలకు గృహ వైద్యం... రాలిపోతాయంతే...

పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వంద మందిలోనూ కనీసం 10 నుండి 15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరి కాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్‌ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరిలకు ప్రధాన కారణం వైరస్‌ (హ్యూమన్‌ పాపిలోమా

శనివారం, 20 ఆగస్టు 2016 (16:38 IST)
పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వంద మందిలోనూ కనీసం 10 నుండి 15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరి కాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్‌ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరిలకు ప్రధాన కారణం వైరస్‌ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడ పైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి. మనకు అందుబాటులో ఉండే వస్తువులతో ఈ పులిపిర్లను సమసిపోయేటట్లు చేయవచ్చు.
 
అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దాలి. వెల్లుల్లి రేకలను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది. 
 
పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి. కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి.
 
పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేప నూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ -ఎకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగ్గొట్టి గుజ్జుగా చేసి ఒకటి రెండు నెలలపాటు ప్రతిరోజూ పులిపిర్ల మీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అన్నీ చూడండి

రైతులు వేధింపులకు గురువుతున్నారు.. అమరావతిలో జగన్ భేటీ

జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య!

గ్రాడ్యుయేషన్ పరేడ్‌ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ (వీడియో)

తెలంగాణలో జనసేన బలపడుతుందా? ఆంధ్రా నాయకుడిగా ముద్రపడిందిగా?

కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

తర్వాతి కథనం
Show comments