మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (10:41 IST)

ఉదయాన్నే అరచెంచా దాల్చిన చెక్క పొడిని..?

టైప్-2 మధుమేహాన్ని దాల్చిన చెక్క నయం చేస్తుంది. రోజూ ఉదయాన్నే బాగా మరిగించిన నీటిలో ఓ అరచెంచా పొడిని వేయాలి. క్షణాల్లో నీరు ఎర్రగా మారిపోతుంది. ఈ చెక్కలో ఘాటుతో రాటు తీపి కూడా ఉంటుంది కాబట్టి చక్కర గా

టైప్-2 మధుమేహాన్ని దాల్చిన చెక్క నయం చేస్తుంది. రోజూ ఉదయాన్నే బాగా మరిగించిన నీటిలో ఓ అరచెంచా పొడిని వేయాలి. క్షణాల్లో నీరు ఎర్రగా మారిపోతుంది. ఈ చెక్కలో ఘాటుతో రాటు తీపి కూడా ఉంటుంది కాబట్టి చక్కర గానీ, బెల్లంగానీ వేయాల్సిన అవసరం లేదు. రోజూ ఈ ద్రావణాన్ని తాగితే షుగర్ నిలువలు పూర్తి నియంత్రణలో ఉంటాయి. క్రమం తప్పకుండా సేవిస్తే మున్ముందు గాంగ్రిన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
దాల్చిన చెక్క సమర్థవంతంగా పనిచేస్తుంది. కొంతమంది రోజూ ఒక చిన్న ముక్కను నములుతుంటారు. కాకపోతే.. షుగర్ నిలువలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కాస్తంత మోతాదు సరిపోదు. అంతకంటే దాల్చిన చెక్కను పొడి చేసి ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలని.. షుగర్‌ ఎక్కువైనప్పుడల్లా పావు స్పూన్ నీటిలో వేసుకుని సేవిస్తుండాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.