శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:00 IST)

చర్మంలోని ఇన్ఫెక్షన్లను తగ్గించే మల్లెపువ్వులు.. జాస్మిన్ నూనెను జుట్టుకు రాస్తే?

మల్లెపువ్వుల్లో వాసనే కాదు.. సౌందర్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయని బ్యూటీషన్లు అంటున్నారు. మల్లెపువ్వులు అందాన్ని, సువాసనను ఇవ్వడమే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాగంటే.. మల్లె పువ్వుల రసాన్ని క

మల్లెపువ్వుల్లో వాసనే కాదు.. సౌందర్య పోషకాలు పుష్కలంగా ఉన్నాయని బ్యూటీషన్లు అంటున్నారు. మల్లెపువ్వులు అందాన్ని, సువాసనను ఇవ్వడమే కాదు.. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాగంటే.. మల్లె పువ్వుల రసాన్ని కలిగివుండే లోషన్ లేదా క్రీములను వాడటం ద్వరా చర్మం తేమగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మల్లెపూవులలో వుండే యాంటీ మైక్రోబియల్, సెప్టిక్ గుణాలు తలపై వున్న చర్మంలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అంతే తలపై వున్న చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
అలాగే కొబ్బరి నూనెలలో మల్లెపూవుల నూనెను కలిపి తలకు రాసుకుని మెల్లమెల్లగా మర్గన చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. హాయిగా నిద్రపోవచ్చు. మల్లెపూవుల్ని పెట్టుకుంటే శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అందుకే జాస్మిన్ స్ప్రేను వాడటం మంచిది. జాస్మిన్‌తో చేసిన నూనెను జుట్టుకు పట్టిస్తే మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.