1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (13:05 IST)

యువతీయువకుల విచ్చలవిడి శృంగారంతో కలిగే అనర్థాలేంటి? రోజులో ఎన్నిసార్లు చేయాలి?

మనిషి జీవితంలో శృంగారం ఓ భాగం. దాంపత్య జీవితం సజావుగా సాగడానికి ఇదే సరైన అమృతం. అయితే, స్త్రీపురుషులు, ప్రేమికుల మధ్య శృంగారం చాలా సున్నితంగా, సుతారంగా జరగాలి. శృంగారంలో స్వర్గాన్ని చూడొచ్చూ.. మరణాన్న

మనిషి జీవితంలో శృంగారం ఓ భాగం. దాంపత్య జీవితం సజావుగా సాగడానికి ఇదే సరైన అమృతం. అయితే, స్త్రీపురుషులు, ప్రేమికుల మధ్య శృంగారం చాలా సున్నితంగా, సుతారంగా జరగాలి. శృంగారంలో స్వర్గాన్ని చూడొచ్చూ.. మరణాన్ని పొందవచ్చూ. 
 
నేటి యువత ఇతర అంశాలకంటే అధికంగా శృంగారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఫలితంగా విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటూ అనేక సుఖ వ్యాధులతో పాటు మరణాన్ని కూడా తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా యుక్త వయస్సు యువతీ యువకులు అధికసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల కలిగే అనర్థాలపై ఓ అధ్యయనం జరిగింది. 
 
ఒకేరోజు ఎక్కువ సార్లు శృతిమించి శృంగారంలో పాల్గొనడం అంటే ప్రాణాలను ఫణంగా పెట్టడంతో సమానం. తమ లైంగిక శక్తికి అనుగుణంగా శృంగారంలో పాల్గొనాలి. మగ లేదా ఆడవారు శృంగారంలో పాల్గొనేటప్పుడు కాస్త సంయమనం పాటించాలి. 
 
ముఖ్యంగా 20 నుంచి 25 యేళ్ళలోపు యువతీయువకులు లేదా నవదంపతులు రోజులో ఛాన్స్ దొరికినపుడుల్లా (రోజుకు 4-5 సార్లు) శృంగారంలో పాల్గొంటారు. ఐతే మితం దేనికైనా మంచిదే అన్నట్లు ఇందులోనే పాటించాలి. అలా పాటిస్తే ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలు దరిచేరవు.