1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. salt health benefits for the sore throat

గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఉప్పు నీటిని తీసుకుంటే?

వర్షాకాలంలో వచ్చే సమస్యలలో గొంతునొప్పి ఒకటి. ఇది వైరల్‌ లేదా బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన వస్తుంది. కొన్నిసార్లు ఏ ఇన్‌ఫెక్షన్‌ లేకుండా కూడా గొంతునొప్పి రావచ్చు. అన్ని వయసులవారిలోనూ ఈ సమస్య కనిపిస్తు

salt
వర్షాకాలంలో వచ్చే సమస్యలలో గొంతునొప్పి ఒకటి. ఇది వైరల్‌ లేదా బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన వస్తుంది. కొన్నిసార్లు ఏ ఇన్‌ఫెక్షన్‌ లేకుండా కూడా గొంతునొప్పి రావచ్చు. అన్ని వయసులవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో అయితే టాన్సిల్స్‌ వాడి గొంతు నొప్పి వస్తే, పెద్దవారిలో గొంతులో పూతలా సమస్య మొదలవుతుంది.
 
మాట బొంగురు పోవడం, మాట్లాడుతుంటే నొప్పిగా ఉండటం, గుటక వేయలేకపోవడం, ఆహారం మింగలేకపోవడం వంటివి ప్రధాన లక్షణాలు. కొందరికి గొంతు  నొప్పితో పాటు దగ్గు, జ్వరం కూడా బాధిస్తుంది. అందువలన చెంచా అల్లం తురుమును కప్పు నీటిలో మరిగించి వడపోయాలి. ఇందులో చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగితే తక్షణమే గొంతు నొప్పి తీవ్రత తగ్గుతుంది.
 
రెండు లవంగాలు, లేదా కొద్దిగా రాళ్లుప్పును దవడన పెట్టుకుని చప్పరిస్తూ ఉండాలి. చిన్న పటిక బెల్లం ముక్క నోట్లో పెట్టుకుని చప్పరిస్తే కూడా గొంతునొప్పి మెల్లగా తగ్గుతుంది. గొంతు నొప్పి విపరీతంగా ఉంటే వేడి నీళ్లలో చెంచా రాళ్ల ఉప్పు వేయాలి. అది కరిగాక ఆ నీటిని రోజులో రెండు లేదా మూడు సార్లు బాగా పుక్కలించి ఉమ్మేయాలి. ఉప్పునీరు గొంతులోని కఫాన్ని తగ్గిస్తుంది. ఉప్పునీరు తగిలిన చోట ఇన్‌ఫెక్షన్‌ కూడా త్వరగా తగ్గుతుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
స్త్రీల అందానికి చిట్కాలు