శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జులై 2018 (12:45 IST)

అల్పాహారం కడుపు నిండా తీసుకోవాల్సిందే.. లేకుంటే?

అల్పాహారం అధిక పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీస

అల్పాహారం అధిక పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వారు చెప్తున్నారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని వైద్యులు స్పష్టం చేశారు.
 
అల్పాహారాన్ని కడుపు నిండా తీసుకునే వారు ఆరోగ్యంగా వుంటున్నారని.. తద్వారా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం వుండదు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యంగా వున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి. 
 
అలాగే అల్పాహారంలో పండ్లు, బ్రెడ్ ముక్కలు తీసుకోవచ్చు. వీటితోపాటు ఓట్ మిల్క్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో లాభదాయకం. ఉడకబెట్టిన కోడిగుడ్డును ఉదయంపూట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పండ్లను తీసుకుంటుంటే శరీరానికి మంచి శక్తినిస్తాయి. కాబట్టి ఉదయంపూట పండ్లను ఆహారంగా తీసుకునేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.