బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : గురువారం, 19 జులై 2018 (14:48 IST)

పుదీనాతో కుల్ఫీ ఐస్? ఎలా చేయాలో చూద్దాం?

ప్రత్యేకమైన సువాసన మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకుల సొంతం. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్ధంగా నడిపించే పోషకాలు కూడా అధికమే. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విట

ప్రత్యేకమైన సువాసన మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకుల సొంతం. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్ధంగా నడిపించే పోషకాలు కూడా అధికమే. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. మరి ఇటువంటి పుదీనాతో కుల్ఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
కివీపండ్లు - 3 
నిమ్మరసం - 1 స్పూన్ 
కొబ్బరిపాలు - 4 కప్పులు
మొక్కజొన్నపిండి - 2 స్పూన్స్ 
చక్కెర - అరకప్పు 
యాలకులపొడి - 1/2 స్పూన్ 
పుదీనా ఆకులు - 1 కప్పు
 
తయారీ విధానం:
ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో కొబ్బరిపాలు, మొక్కజొన్నపిండిని కలుపుకుని పొయ్యిమీద పెట్టాలి. పాలు సగమయ్యాక ఆ మిశ్రమంలో చక్కెర, యాలకులపొడి వేసి మంట తగ్గించాలి. చక్కెర కరిగిన తరువాత ఇందులో కివీపండ్లు, పుదీనా గుజ్జు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని మిక్సీ‌లో పట్టి కుల్ఫీపాత్రల్లోకి వేసుకుని ఫ్రిజ్‌లో గట్టిగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. అంతే పుదీనా కుల్ఫీ రెడీ.