మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2017 (10:57 IST)

నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.. రాత్రిపూట గేమ్స్ వద్దు..

నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి, అతినిద్ర వల్ల రక్తంలో సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-6లు పెరిగిపోయి రక్తపోటు, టైప్-2 డయాబెటీస్‌‌తో పాటు గుం

నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి, అతినిద్ర వల్ల రక్తంలో సి-రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-6లు పెరిగిపోయి రక్తపోటు, టైప్-2 డయాబెటీస్‌‌తో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల చిరాకు, కోపం, అసహనం, తీవ్ర భావోద్వేగాలు కలగడం, కోరికలు పెరగడం జరుగుతుందట. ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే నిద్రా సమయంలో మార్పులు అవసరమని, ప్రతి మనిషికి సగటున 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెప్తున్నారు. 
 
అందుకే సమయానుసారం తగినంత నిద్రపోవడం మంచిది. నిద్రలేమి వల్ల మానసికంగాను, శారీరకంగాను అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నిద్రలేమి సమస్యకు అనేక కారణాలు ఒత్తిడి, జీవనశైలి, డైట్ మొదలైనవి నిద్రలేమికి కారణం కావచ్చు. నిద్రించేటప్పుడు గోరువెచ్చని పాలను తాగడం మంచిది. తద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు.

ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోడం, నిద్రలేవడం అనేవి అలవాటు చేసుకోవాలి. నిద్రించే ముందు గేమ్స్ చూడటం ద్వారా రాత్రుల్లో ఎక్కువ సమయం గేమ్స్ ఆడటం వల్ల గాఢనిద్రను పొందలేరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.