ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2024 (20:10 IST)

ఫ్యాటీ లివర్ రాకుండా అడ్డుకునే ఆహారాలు, ఏంటవి?

liver
కొవ్వు కాలేయం లేదా ఫ్యాటీ లివర్ సమస్య. లివర్ ఈ ఇబ్బందికి గురికాకుండా వుండేందుకు ప్రత్యేకించి ఈ 6 ఆహారాలు తీసుకుంటుంటే కాలేయం ఆరోగ్యంగా వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
ప్రతిరోజూ పసుపు పాలను తాగితే కొవ్వు కాలేయ వ్యాధిని నిరోధించగలదు.
అల్లం హైపోలిపిడెమిక్, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉండటంతో పాటు ఇన్సులిన్ సెన్సిటైజర్‌గా పనిచేస్తుంది.
బొప్పాయిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కొవ్వు కాలేయ వ్యాధికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.
నిమ్మకాయలలో నారింగెనిన్ అనే సమ్మేళనం కొవ్వు కాలేయ వ్యాధితో సంబంధం ఉన్న కాలేయ మంటను తగ్గిస్తుంది.
చిక్‌పీస్, సోయాబీన్స్, బఠానీలు పోషకాహారాలు మాత్రమే కాకుండా పేగు ఆరోగ్యంతో పాటు కాలేయానికి మేలు చేస్తాయి.
అవోకాడో రక్తంలోని కొవ్వులను తగ్గించి కాలేయం దెబ్బతినకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటుంటే కాలేయ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.