బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: బుధవారం, 2 ఆగస్టు 2017 (17:19 IST)

గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని తింటే ఆ రోజంతా...?

ఉరుకుల, పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో అవసరం. కానీ మనం తినే ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండవు. ముఖ్యంగా ప్రొటీన్లు. అయితే గోధుమ రవ్వను ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గోధుమ రవ్వలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి గోధుమ రవ్వ సరైన ఆహారం. గోధుమ రవ్వతో చేసిన ఉప్మాను కానీ వేరే ఏ వంటకాన్ని అయినా ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. గోధుమ రవ్వలో ఫైబర్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. 
 
ఈ గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని తిన్న తరువాత ఆకలి అదుపులోనే ఉంటుంది. అంతేకాదు జంక్ ఫుడ్ తినడానికి దూరంగా కూడా ఉండొచ్చు. ఉదయం గోధుమ రవ్వ ఉప్మా తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా అవసరమైన న్యూట్రిషియన్స్ లభిస్తాయి. షుగర్ ఉన్నవారికి గోధుమ రవ్వ సరైన ఆహారం.
 
గోధుమ రవ్వను తింటే శరీర సామర్థ్యం పెరిగి మెటబాలజీ కూడా పెరుగుతుంది. మలబద్ధకాన్ని కూడా నిర్మూలిస్తుంది. ఇందులోని హై ఫైబర్ మరియు ప్రొటీన్ వుండటంతో గోధుమ రవ్వను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు.