1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. cm chandra babu in tirumala

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు, సింగపూర్ మంత్రి

cm
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మంగళవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విశాఖ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న చంద్రబాబు నేరుగా తిరుమలకు వెళ్ళారు. ఆయనతోపాటు సింగపూర్ బృందం, ఆ దేశ మంత్రి ఈశ్వరన్ లు కూడా ఉన్నారు. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.