తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం.. బాలమందిర్‌కు వినియోగించాలని కోరిన దాత
తిరుమల వేంకటేశ్వర స్వామి ట్రస్టుకు కోట్లు విరాళంగా ఇచ్చే ఖాతాలోకి మరో కోటీశ్వరుడు చేరిపోయాడు. సోమవారం ఉదయం ఆయన కోటి విలువ చేసే చెక్కును కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అందజేశారు. దానిని తిరుపతిలోని సర్వశ్రేయాన్ ట్రస్టుకు వినియోగించాలని కోరారు. వివరాలిలా ఉన్నాయి.
హెచ్‌సీఎల్ కంపెనీ ఛైర్మన్ శివ్ నాడార్ తిరుమలకు విచ్చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టు టీటీడీకి చెందిన ఎస్వీబాలమందిర్ ట్రస్టుకు రూ. కోటి విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అందజేశారు. అనంతరం స్వామి దర్శనం చేసుకున్నారు.టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వారికి తీర్థప్రసాదలను అందజేశారు.
