1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. P Bhaskar has released the posters of Pushpayagam

25న శ్రీ రామునికి పుష్పయాగం.. పోస్టరు విడుదల చేసిన జేఈవో

Pushpayagam of Sri Kodanda Rama Swamy
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆద్వర్యంలో 25న తిరుపతిలోని కోదండ రామాలయంలో పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ పుష్పయాగానికి సంబంధించిన గోడ పత్రికలను టిటిడి తిరుపతి జేఈవో పోలా భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్పయాగం ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలలోపు జరుగుతుందని చెప్పారు. 24న అంకురార్పణ జరగుతుందన్నారు. 
 
పుఢమి తల్లి నుంచి ఎటువంటి విపత్తులు రాకుండా ఈ కార్యక్రమాన్ని తరతరాలుగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గోడ పత్రిక విడుదల చేసిన కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
About Writer
pyr