తిరుమలలో ఏకాదశి ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాలు భక్తులకు సిద్ధం చేస్తోంది. దర్శనానికి వచ్చే వారి కోసం వసతి, దర్శన ఏర్పాట్లు మొదట వచ్చే వారి ప్రాధాన్యత ప్రకారం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విఐపిల కోసం అధికారులు మూడు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మినిస్టర్లు, ఐఏఎస్ అధికారుల కోటలో ఒక్కొక్కరితో కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.
కార్యనిర్వహణాధికారి, ఆలయ సిబ్బంది కలసి వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. విఐపిలకు ఉదయం 4 గంటల నుంచి, ఒక వేళ ఆలస్యమైతే ఉదయం 5 గంటల అవుతుంది. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తారు.
న్యాయ విభాగం, ప్రొటోకాల్ మరియు ఇతర విఐపిలు, పోలీసులకు ప్రత్యేకమైనటువంటి క్యూలైన్లు నిర్వహిస్తారు.
న్యాయ విభాగ ముఖ్యులు, మంత్రులు రాంబగీచా నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తే, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ప్రవేశిస్తారు.
ద్వాదశి రోజున రూ.300 టికెట్లు తీసుకున్న వారిని వారికిచ్చిన సమయాన్ని అనుసరించి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ లోని అనుమతిస్తారు.
