శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్

ఆయనకు 82 యేళ్లు - ఆమెకు 29 యేళ్లు... తల్లిదండ్రులు కాబోతున్న జంట

al pacino
హాలీవుడ్ సీనియర్ నటుడు, గాడ్ ఫాదర్ చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్న అల్ ఫాసినో 82 యేళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. ఆయన 29 యేళ్ల నూర్ అల్ఫల్లాతో గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెల్లసిందే. ఈ క్రమంలో ఫాసినో ప్రియురాలు నూర్ గర్భం దాల్చింది. 
 
ఈ విషయాన్ని అల్ ఫాసినో ప్రతినిధి ఓ మ్యాగజైన్‌కు తెలిపారు. నూర్ హాలీవుడ్ చిత్రాల నిర్మాతగా కొనసాగుతున్నారు. అల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. డ్యాన్స్ మాస్టర్ జాన్ టరంట్‌‍తో కుమార్తె జాలీ, మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఅంగెలోతో 22 యేళ్ల కవల పిల్లలు కూడా ఉన్నారు.