Dharma Sangrah
✕

సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఎక్స్‌పెండబుల్స్ -4 విడుదల డేట్ ఫిక్స్

Written By డీవీ
Updated: మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:14 IST)
Sylvester Stallone, Scott Waugh, Jet Li, Tony Jaa and others
యాక్షన్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్ర పోషించిన ఎక్స్‌పెన్ డ బుల్స్-4 విడుదలకు సిద్ధమైంది. ఎక్స్‌పెండబుల్ సిరీస్ డేవిడ్ కల్లాహం సృష్టించిన పాత్రల ఆధారంగా రూపొందించబడింది. ఎక్స్‌పెన్ డ బుల్స్ అనేది స్పెన్సర్ కోహెన్, విమ్మర్, డాగర్‌హార్ట్ కథ ఆధారంగా కర్ట్ విమ్మర్, టాడ్ డాగర్‌హార్ట్,  మాక్స్ ఆడమ్స్ స్క్రీన్ ప్లే నుండి స్కాట్ వా దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ యాక్షన్ చిత్రం. ఇది ది ఎక్స్‌పెండబుల్స్ 3కి సీక్వెల్. ఈ సినిమా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 22, 2023న విడుదల కానుందని PVR పిక్చర్స్ తెలియజేసింది. మల్టీవిజన్ మల్టీమీడియా ఇండియా ప్రై. లిమిటెడ్ సమర్పణ. 
 
ది ఎక్స్‌పెండబుల్స్ మొదటి సిరీస్‌ (2010)లో  జాసన్ స్టాథమ్, జెట్ లీ నటించగా  ఎక్స్‌పెండబుల్స్ 2 (2012)లో జెట్ లీ, బ్రూస్ విల్లిస్,లియామ్ హేమ్స్‌వర్త్, 3 లో (2014)లో ఆంటోనియో బాండెరాస్, మెల్ గిబ్సన్ ఉన్నారు,  4వ ఈ సిరీస్‌లో టోనీ జా, మేగాన్ ఫాక్స్, ఐకో ఉవైస్ ఉన్నారు. 
 
USA, రష్యా మధ్య యుద్ధాన్ని నివారించడానికి, డేర్-డెవిల్ ది ఎక్స్‌పెండబుల్స్ జట్టు- నిరోధించే అద్భుతమైన  మిషన్‌తో ఈ చిత్రం సాగుతుంది. సుర్టో రహ్మత్ (ఇకో ఉవైస్) నేతృత్వంలోని ఉగ్రవాద సంస్థ లిబియాలోని రసాయనాల కర్మాగారం నుండి అణు క్షిపణి డిటోనేటర్లు  ధనికులకు అమ్ముతారు. రెండు సూపర్ పవర్స్! ఎక్స్‌పెండబుల్స్ బృందం చర్యలోకి దిగి ముందుకు సాగుతుంది. ఇది చాలా హైప్ క్రియేట్ చేస్తాయని దర్శకుడు తెలిపారు. 
 
తారాగణం-సిల్వెస్టర్ స్టాలోన్, జాసన్ స్టాథమ్, డాల్ఫ్ లండ్‌గ్రెన్, మేగాన్ ఫాక్స్, 50 శాతంజాక్సన్, టోనీ జా, ఐకో ఉవైస్ తదితరులు సినిమాటోగ్రఫీ-టిమ్ మారిస్-జోన్స్ సంగీతం-గ్విలేమ్ రౌసెల్. 

అన్నీ చూడండి

సోనియా గాంధీ బయోగ్రఫీ పుస్తకంలో రాష్ట్ర ప్రస్తావన ఎందుకు లేదు: కేటీఆర్

చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష..

నేలపై జాతీయ జెండా మార్కర్.. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారంటే? (video)

రూ.94 లక్షల విలువైన విలాసవంతమైన చేతి గడియారం.. భారత ప్రయాణీకుడి అరెస్ట్

ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?

అన్నీ చూడండి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

తర్వాతి కథనం
Show comments