గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (11:09 IST)

సొరకాయ గింజలకు ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే?

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. అంతేకాకుండా ఈ కాయలో జీవ క్రియల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వీర్యవృద్ధి, లైంగిక

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. అంతేకాకుండా ఈ కాయలో జీవక్రియల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వీర్యవృద్ధి, లైంగిక శక్తి పెరగడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
 
ప్రధానంగా పురుషుల్లో వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం. సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శారీరకదారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది.
 
హృదయసంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరుచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే... శొంఠిపొడినిగానీ, మిరియాల పొడినిగానీ కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. అలాగే, అందాన్ని మరింత ద్విగుణీకృతం చేయడంతో పాటు.. బరువును కూడా తగ్గిస్తుందట. 
 
సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరుచూ తింటే ఎంతో మేలు కలుగుతుందట. ఇంకెందుకు ఆలస్యం.. సొరకాయతే చేసిన కూరలు లేదా సొరకాయ విత్తనాలను తినేందుకు సిద్ధంకండి.