మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర సినిమా పెద్దగా క్రేజ్ లేదు. ఈ ఏడాది సంక్రాంతికి అనుకుని గేమ్ ఛేంజర్ కు గేట్లు తెరవడంతో విశ్వంజభర వెనక్కు వెళ్ళినట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత మరలా కొంతకాలంగేప్ తీసుకుని సాంకేతిక అంశాలవల్ల కాస్త ఆలస్యం అవుతుంది అన్నట్లు కొంత వర్క్ కూడా చేశారు. ఆ తర్వాత థియేటర్లలో కొన్ని చోట్ల టీజర్ లను ప్లే చేశారు. ఎందుకనో పెద్దగా ఆసక్తి కలిగించలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమాకు ఊపు వచ్చినట్లయింది. అందుకు కారణం జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్.
రిరిలీజ్ లో శుక్రవారంనాడు హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో 3డి వర్షన్, 2డి వర్షన్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. అందులో యూత్ కూడా వున్నారు. సినిమా చూశాక కొందరు మహిళలు ఈ సినిమా రిలీజ్ అప్పుడు కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. మరలా ఇప్పుడు చూడడం చాలా థ్రిల్ కలిగించిందని అన్నారు. చిరంజీవి విశ్వంభర సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నామని అందులోనూ పౌరాణిక అంశాలున్నాయని వారు పేర్కొంటున్నారు.
ఫాంటసీ సినిమాలు చిరంజీవికి బాగా సెట్ అవుతాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఈ రీరిలీజ్ కూడా మంచి హిట్ కాగా మళ్ళీ మెగాస్టార్ నుంచి రాబోతున్న ఫాంటసీ జానర్ సినిమా “విశ్వంభర” పై మళ్ళీ హైప్ నెలకొంది.